దేశంలోకి తిరిగొచ్చే వలసదారులకు సంబంధించి పూర్తి మార్గదర్శకాలు త్వరలో

- July 07, 2021 , by Maagulf
దేశంలోకి తిరిగొచ్చే వలసదారులకు సంబంధించి పూర్తి మార్గదర్శకాలు త్వరలో

కువైట్: దేశంలోకి తిరిగొచ్చే వలసదారులకు (నివాసితులకు) సంబంధించి పూర్తి మార్గదర్శకాలు త్వరలో విడుదల కానున్నాయి. రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయినవారికి ఆగస్ట్ 1 నుంచి దేశంలోకి వలసదారుల్ని అనుమతించనున్న నేపథ్యంలో సంబంధిత మార్గదర్శకాల విషయమై కసరత్తు జరుగుతోంది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అధికారులతో సమావేశం కోసం ఎయిర్‌పోర్టు అథారిటీస్ ఎదురుచూస్తున్నాయి. ప్రస్తుతం వున్న ఆపరేషనల్ కెపాసిటీ 3,500 నుంచి 5,000కి పెంపు విషయమై పలు అనుమానాలకు ఈ సమావేశంలో నివృత్తి కలగనుంది. జూన్ 17న కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, విదేశాల నుంచి వచ్చే వలసదారులు (రెసిడెంట్స్) విషయమై రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుంటేనే అనుమతిచ్చేలా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆగస్ట్ 1 నుంచి వారి రాకకు అనుమతిస్తారు. అయితే, 72 గంటల ముందుగా వారంతా పీసీఆర్ టెస్ట్ రిజల్ట్ తమ వెంట తీసుకురావాల్సి వుంటుంది. ఏడు రోజుల హోం క్వారంటైన్ కూడా తప్పనిసరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com