కోవిడ్ సంజీవినిగా సోట్రోవిమాబ్..95% రికవరీ రేటు
- July 08, 2021
బహ్రెయిన్: రోజుకో వేరియంట్ తో దడ పుట్టిస్తున్న కోవిడ్ వైరస్ పై పోరాటంలో మోనోక్లోనల్ యాంటీబాడ్ డ్రగ్ 'సోట్రోవిమాబ్' సమర్ధవంతంగా పని చేస్తున్నట్లు బహ్రెయిన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది.ప్రస్తుత వేరియంట్లపై సోట్రోవిమాబ్ సరైన విరుడుగా కనిపిస్తోందని అభిప్రాయపడింది. కోవిడ్ ట్రీట్మెంట్లో భాగంగా సోట్రోవిమాబ్ డ్రగ్ తీసుకున్న పేషెంట్లు 95 శాతం మంది కేవలం 5 రోజుల్లోనే కోలుకున్నట్లు వెల్లడించింది. జాతీయ ఆరోగ్య నియంత్రణ అధికార విభాగం-NHRA సోట్రోవిమాబ్ డ్రగ్ కు అత్యవసర ఆమోదం తెలిపిన తర్వాత జూన్ 18 నుంచి కోవిడ్ పేషెంట్లకు డ్రగ్ అందిస్తున్నారు.జూన్ 18 నుంచి జులై 1 వరకు మొత్తం 230 మంది కోవిడ్ పేషెంట్లకు సోట్రోవిమాబ్ అందించారు.అందులో 95 శాతం మంది కేవలం 5 రోజుల్లోనే కోలుకున్నారని, మిగిలిన 5 శాతం మందికి 5 రోజుల కంటే ఎక్కువ సమయం పట్టిందని వివరించింది. ఓవరాల్ గా చూసుకుంటే వందకు వంద శాతం మంది కోవిడ్ నుంచి కోలుకున్నారని తెలిపింది.పైగా సోట్రోవిమాబ్ తో ఇప్పటివరకు పేషెంట్లలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించలేదని తెలిపింది. ఐసీయూలో చేర్పించాల్సిన అవసరం కూడా ఏర్పడలేదని వివరించింది. దీంతో సోట్రోవిమాబ్ కోవిడ్ పేషెంట్ల పాలిట సంజీవినిగా భావిస్తున్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







