కర్ఫ్యూకు ప్రత్యామ్నాయ చర్యలతోనే వైరస్ నియంత్రణకు చర్యలు
- July 08, 2021
కువైట్: కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు కర్ఫ్యూ విధించే యోచన చేయటం లేదని కువైట్ స్పష్టం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో పూర్తి కర్ఫ్యూ విధించబోమని మంత్రివర్గం నుంచి అందుతున్న సమాచారం. అదే సమయంలో పాక్షిక కర్ఫ్యూ వైపు కూడా ఆలోచించటం లేదని సూచనప్రాయంగా తెలుస్తోంది. అయితే..కోవిడ్ వ్యాప్తిని అడ్డుకునేందుకు మాత్రం ప్రత్యామ్నాయ మార్గాలను అవలంభించే అవకాశాలు ఉన్నాయి. కర్ఫ్యూ విధించకుండానే కొన్ని కఠిన నిబంధనలు అమలు చేస్తూ వైరస్ విస్తృతికి అడ్డుకట్ట వేయాలనే యోచనలో ఉంది. ఇదిలాఉంటే కువైట్లో కోవిడ్ తీవ్రత కొద్దిమేర తగ్గుముఖం పట్టడం ఊరట కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,585 కోత్త కేసులు నమోదయ్యాయి. కోవిడ్ తో పది మంది మృతి చెందారు.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







