కోవిడ్ సంజీవినిగా సోట్రోవిమాబ్..95% రికవరీ రేటు

- July 08, 2021 , by Maagulf
కోవిడ్ సంజీవినిగా సోట్రోవిమాబ్..95% రికవరీ రేటు

బహ్రెయిన్: రోజుకో వేరియంట్ తో దడ పుట్టిస్తున్న కోవిడ్ వైరస్ పై పోరాటంలో మోనోక్లోనల్ యాంటీబాడ్ డ్రగ్ 'సోట్రోవిమాబ్' సమర్ధవంతంగా పని చేస్తున్నట్లు బహ్రెయిన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది.ప్రస్తుత వేరియంట్లపై సోట్రోవిమాబ్ సరైన విరుడుగా కనిపిస్తోందని అభిప్రాయపడింది. కోవిడ్ ట్రీట్మెంట్లో భాగంగా సోట్రోవిమాబ్ డ్రగ్ తీసుకున్న పేషెంట్లు 95 శాతం మంది కేవలం 5 రోజుల్లోనే కోలుకున్నట్లు వెల్లడించింది. జాతీయ ఆరోగ్య నియంత్రణ అధికార విభాగం-NHRA సోట్రోవిమాబ్ డ్రగ్ కు అత్యవసర ఆమోదం తెలిపిన తర్వాత జూన్ 18 నుంచి కోవిడ్ పేషెంట్లకు డ్రగ్ అందిస్తున్నారు.జూన్ 18 నుంచి జులై 1 వరకు మొత్తం 230 మంది కోవిడ్ పేషెంట్లకు సోట్రోవిమాబ్ అందించారు.అందులో 95 శాతం మంది కేవలం 5 రోజుల్లోనే కోలుకున్నారని, మిగిలిన 5 శాతం మందికి 5 రోజుల కంటే ఎక్కువ సమయం పట్టిందని వివరించింది. ఓవరాల్ గా చూసుకుంటే వందకు వంద శాతం మంది కోవిడ్ నుంచి కోలుకున్నారని తెలిపింది.పైగా సోట్రోవిమాబ్ తో ఇప్పటివరకు పేషెంట్లలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించలేదని తెలిపింది. ఐసీయూలో చేర్పించాల్సిన అవసరం కూడా ఏర్పడలేదని వివరించింది. దీంతో సోట్రోవిమాబ్ కోవిడ్ పేషెంట్ల పాలిట సంజీవినిగా భావిస్తున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com