ఇజ్రాయిల్‌ నూతన అధ్యక్షుడిగా హెర్జోగ్‌ ప్రమాణం

- July 08, 2021 , by Maagulf
ఇజ్రాయిల్‌ నూతన అధ్యక్షుడిగా హెర్జోగ్‌ ప్రమాణం

జెరూసలేం: ఇజ్రాయిల్‌ నూతన అధ్యక్షుడుగా ఇజాక్‌ హెర్జోగ్‌ (60) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రావెన్‌ రివ్లిన్‌ స్థానంలో దేశ 11వ అధ్యక్షుడిగా హెర్జోగ్‌ ప్రమాణం చేస్తారు. ఏడేళ్ళ పాటు ఆయన ఈ పదవిలో వుంటారు.గత నెల్లో ఇజ్రాయిల్‌ పార్లమెంట్‌ ఆయనను అధ్యక్ష పదవికి ఎన్నుకుంది.లేబర్‌ పార్టీ అధినేతగా పనిచేసిన ఆయన పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేతగా కూడా బాధ్యతలు నిర్వహించారు. 2018లో రాజకీయాలు వీడిన తర్వాత యూదుల సంక్షేమం కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థ చీఫ్‌గా వున్నారు.హెర్జోగ్‌ తండ్రి చైమ్‌ హెర్జోగ్‌ కూడా 1980వ దశకంలో అధ్యక్షుడిగా వున్నారు. అంతకుముందు ఆయనన ఐక్యరాజ్య సమితిలో ఇజ్రాయిల్‌ రాయబారిగా వున్నారు.ఆయన తాత దేశ ప్రధమ చీఫ్‌ రబ్బిగా వున్నారు.ఆయన అంకుల్‌ విదేశాంగ మంత్రిగా పనిచేశారు. ఇజ్రాయిల్‌ సమాజంలో తీవ్ర విభేదాలు నెలకొన్న సమయంలో బాధ్యతలు స్వీకరించడంపై హెర్జోగ్‌ స్పందిస్తూ, తాను ప్రతి ఒక్కరి అధ్యక్షుడిగా వుండేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఇజ్రాయిల్‌ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తామన్నారు. ప్రధాని నఫతాలి బెన్నెట్‌ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే హెర్జోగ్‌ బాధ్యతలు చేపడుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com