వాహనాల్లో ప్రయాణీకులందరికీ సీట్ బెల్ట్ తప్పనిసరి
- July 08, 2021
యూఏఈ: వాహనాల్లో వెళుతున్నప్పుడు సీటు బెల్టు ధరించకపోతే 400 దిర్హాములు జరిమానా చెల్లించాల్సి వుంటుంది. నాలుగు బ్లాక్ పాయింట్లు అలాగే లైసెన్స్ రద్దు కూడా తప్పకపోవచ్చు. వాహనంలో ప్రతి ప్రయాణీకుడు కూడా సీటు బెల్ట్ పెట్టుకోవాల్సిందే. కాగా, ఆటోమేటెడ్ విధానం ద్వారా వాహనాల్లో ఉల్లంఘనల్ని గుర్తించనున్నట్లు అధికారులు గతంలోనే వెల్లడించారు. మొబైల్ ఫోన్ వాడుతూ డ్రైవింగ్ చేయడం వంటి వాటిని ఈ విధానం గుర్తిస్తుంది. హై రిజల్యూషన్ చిత్రాలతో ఉల్లంఘనుల్ని ఇట్టే పట్టేస్తారు. సీటు బెల్టు ధరిస్తే, రోడ్డు ప్రమాదాల్లో మరణాల శాతం సగానికి తగ్గే అవకాశముంటుంది. ఇది ముందు సీట్లలోనివారికి. వెనక సీట్లలో వారికి 25 నుంచి 75 శాతం వరకు రిస్క్ తగ్గుతుంది.
తాజా వార్తలు
- భారత్‌లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్‌లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు
- దుబాయ్‌లో ఘనంగా ప్రవాస తెలుగువారి క్రూజ్ క్రిస్మస్ వేడుకలు
- 'National Army Day' కి ఐక్యతతో నివాళులు







