సీజనల్ బ్యాన్‌తో పెరిగిన చేపల ధరలు
- March 09, 2016
మార్చ్ 1 నుంచి ఏప్రిల్ 30 వరకు విధించిన బ్యాన్ కారణంగా మార్కెట్‌లో చేపల ధరలు గణనీయంగా పెరిగాయి. రాబిట్ ఫిష్, ఎంపరర్ ఫిష్ ధరలు మండుతున్నాయి. గ్రూపర్ ఫిష్ (హేమర్) యూఏఈలో చాలా పాపులర్. దీనికి కూడా డిమాండ్ విపరీతంగా పెరిగింది. సీజనల్ బ్యాన్ కారణంగా ధరల పెరుగుదల 40 నుంచి వంద శాతం ఉన్నట్లు డేరా ఫిష్ మార్కెట్ వ్యాపారులు వెల్లడించారు. రీ-ప్రొడక్టివ్ సీజన్ కారణంగా చేపల ఉత్పత్తిని పెంచేందుకే ఈ బ్యాన్ విధించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. సాధారణంగా హేమర్ కిలో ధర 20 నుంచి 25 దిర్హామ్‌లదాకా ఉంటుంది. అయితే ఇప్పుడు అది 35 నుంచి 40 దిర్హామ్‌లకు చేరుకుంది. బ్యాన్ నిబంధనల్ని ఉల్లంఘించినవారికి 1000 దిర్హామ్‌లదాకా ఫైన్ తప్పనిసరి. పదే పదే నిబంధనల్ని ఉల్లంఘిస్తే, దుకాణాల మూసివేతకూ ఆదేశాలిస్తారు.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







