APNRTS సభ్యత్వం నమోదు చేసుకోండి: డైరెక్టర్ ఇలియాస్ బి.హెచ్

- July 13, 2021 , by Maagulf
APNRTS సభ్యత్వం నమోదు చేసుకోండి: డైరెక్టర్ ఇలియాస్ బి.హెచ్

రాజంపేట:ప్రవాసాంధ్రులకు APNRTS చేయూత.వివరాల్లోకి వెళ్తే కడప జిల్లా రాజంపేట పట్టణానికి చెందిన షేక్ హఫీజ్ అనే ప్రవాసాంధ్రుడు, కువైట్ లో సుగంధ ద్రవ్యాల కంపెనీలో స్టోర్ కీపర్ గా పని చేస్తుండేవారు. జనవరి 2021 లో హఫీజ్ కు కిడ్నీ సంబంధిత సమస్యతో కువైట్ లోని  అమిరి ఆసుపత్రిలో చేరారు. వైద్యం సరిగా అందకపోవడంతో భారతదేశం తిరిగొచ్చి తిరుపతిలోని స్నేహ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకొని ఆపరేషన్ చేయించుకున్నారు.ఆపరేషన్ కు రూ.56,800 ఖర్చు అయింది.కువైట్ లో హఫీజ్ APNRTS  కో- ఆర్దినేటర్ల ద్వారా APNRTS వారు,అందించే ప్రవాసాంధ్ర భరోసా బీమాలో నమోదు చేయించుకున్నారు.దీని వలన ఇప్పుడు ఆపరేషన్ కు అయిన ఖర్చు ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా రీయింబర్స్‌ చేయడం జరిగింది. 

ఈ సందర్బంగా,APNRTS డైరెక్టర్ ఇలియాస్ మాట్లాడుతూ...ముఖ్యమంత్రి  వై.యస్. జగన్మోహన్ రెడ్డి  మార్గదర్శకత్వంలో,APNRTS అధ్యక్షులు వెంకట్ ఎస్ మేడపాటి నేతృత్వంలో APNRTS  వివిధ దేశాలలో ఉన్న ప్రవాసాంధ్రుల కోసం పనిచేస్తోంది.ప్రవాసాంధ్రుల సంక్షేమం, భద్రత, సేవ, అభివృద్ది కోసం పాటుపడుతూ వారికి సహకారాన్ని అందిస్తూ, వివిధ సేవలను  అందిస్తోందన్నారు.ఇందులో ఒకటే ఈ ప్రవాసాంధ్ర భరోసా బీమా అని,ఇది విదేశాలలో ఉన్న వారి కుటుంబాలకు ఆర్ధిక భరోసా అని తెలిపారు.18 నుండి 60 సంవత్సరాల వయసు కలిగిన ఉద్యోగులు, విద్యార్థులైన ప్రవాసాంధ్రులు ఈ పథకంలో నమోదు చేసుకోవడానికి అర్హులు. ఉద్యోగులైతే  3 సంవత్సరాలకు కేవలం రూ.550, విద్యార్థులైతే  సంవత్సరానికి రూ.180 లతో ఈ బీమాలో నమోదు చేసుకోవచ్చన్నారు. 

బీమా చేయబడిన వ్యక్తి  ప్రమాదవశాత్తు మరణించినా లేదా శాశ్వత అంగవైకల్యం కలిగినా నష్ట పరిహారం కింద వారి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్ధిక సహాయం, ప్రమాదం వలన సంభవించే గాయాలు,అస్వస్థత చికిత్సకు అయ్యే ఆసుపత్రి ఖర్చుల కింద రూ.1 లక్ష వరకు చెల్లింపు వంటి మరెన్నో ప్రయోజనాలున్నాయని అన్నారు.ఇన్ని ప్రయోజనాలున్న ఈ ప్రవాసాంధ్ర భరోసా బీమా లో విదేశాలలో నివసిస్తున్న లేదా విదేశాలకు వెళ్ళాలనుకుంటున్న  ప్రతి ఒక్క విద్యార్ధి, ఉద్యోగి నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరిన్ని వివరాలకు APNRTS 24/7 హెల్ప్ లైన్ నంబర్లు 0863 2340678, వాట్సాప్ నంబర్ 85000 27678 లను సంప్రదించగలరు.

ఈ సందర్భంగా షేక్ హఫీజ్ మాట్లాడుతూ, నాకు  కష్ట కాలంలో ప్రవాసాంధ్ర భరోసా బీమా  నన్ను ఆదుకుంది.సకాలంలో ఇన్సూరెన్స్ కంపెనీ నుండి డబ్బులు అందాయి.దీనంతటికి కారణమైన APNRTS,అధ్యక్షులు వెంకట్ ఎస్ మేడపాటి, సీఈఓ ఎస్.దినేష్ కుమార్,  డైరెక్టర్ బి.హెచ్ ఇలియాస్ కి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి మర్రి రవి, రాజంపేట పట్టణ, రైతు కన్వీనర్,గోవిందు బాలకృష్ణ, మరియు APNRTS, కెరీర్ కౌన్సిలర్ దివ్య రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com