ప్రయాణ నిబంధనలు ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలన్న ప్రభుత్వం
- July 14, 2021
ఖతార్: సమ్మర్ బ్రేక్ లో చాలా మంది పౌరులు, ప్రవాసీయులు ఇతర దేశాలు, సొంత దేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్న నేపథ్యంలో ఖతార్ ప్రభుత్వం ప్రయాణ విధానాలపై కీలక ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికులు ట్రావెల్ పాలసీలో అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు https://covid19.moph.gov.qa/EN/travel-and-return-policy/Pages/default.aspx లింక్ ద్వారా చెక్ చేసుకోవాల్సిందిగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోరింది. కోవిడ్ నేపథ్యంలో ట్రావెల్ పాలసీలో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయని, కొత్త నిబంధనలపై ఎప్పటికప్పుడు దృష్టి సారించాలని తెలిపింది. అయితే..సమ్మర్ వెకేషన్లో చాలామంది విదేశీ ప్రయాణాలకు ప్లాన్ చేసుకుంటున్న నేపథ్యంలో జూన్ 8న ప్రకటించిన ట్రావెల్ పాలసీని ప్రకటించింది. జులై 12 నుంచి ఈ నిబంధనలు అమలులోకి వచ్చాయి. అయితే..తొలుత ప్రకటించిన పాలసీలో చాలా నిబంధనలను సరళతరం చేశామని పేర్కొంది. పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ తీసుకున్నవారికి చాలావరకు మినహాయింపులు ఇచ్చింది.
అదేవిధంగా విదేశాల నుంచి తిరిగివచ్చే వారు తమ ప్రయాణానికి ముందే ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాలని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే..సవరించిన నిబంధనల మేరకు ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అది ఒక అప్షన్ గా మాత్రమే పరిగణించవచ్చు. తొలుత సినోవాక్ ను కండీషనల్ వ్యాక్సినేషన్ లిస్ట్ నుంచి తొలిగించింది. చిన్నారుల క్వారంటైన్ విధానాల్లో కూడా మార్పులు చేసింది. ప్రవాసీయులకు సులభంగా అర్ధమయ్యేలా అరబిక్, తమిళ్, మళయాలం, సిన్హాలా, హింది భాషల్లో ట్రావెల్ పాలసీని అప్ డేట్ చేస్తున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పరిస్థితులకు అనుగుణంగా నిబంధనల్లో సవరణలు మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు ఉన్నాయి కనుక, ప్రయాణికులు ఎప్పటికప్పుడు ట్రావెల్ పాలసీని చెక్ చేసుకోవాలని సూచించింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్‌ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్‌పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్‌ఫామ్‌కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







