అదిరిపోయిన ‘నారప్ప’ ట్రైలర్
- July 14, 2021అగ్రకథానాయకుడు దగ్గుబాటి వెంకటేశ్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘నారప్ప’. ‘సీతమ్మ వాకింట్లో సిరిమల్లె చెట్టు’ ఫేమ్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితుల రీత్యా.. ఎన్నో రోజుల సంగ్ధిదత తర్వాత ‘నారప్ప’ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ నేపథ్యంలో బుధవారం ‘నారప్ప’ ట్రైలర్‌ను నెట్టింట్లో విడుదల చేసింది. భూమి కోసం పోరాటం చేసే వ్యక్తిగా వెంకటేశ్ నటన ప్రతిఒక్కరితో చప్పట్లు కొట్టించేలా ఉంది. ఆయన చెప్పిన డైలాగులు ఈలలు వేయించేలా ఉన్నాయి.
తమిళంలో సూపర్‌హిట్ అందుకున్న ‘అసురన్’ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. కుల వ్యవస్థ, భూవివాదం వంటి సామాజిక అంశాలతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ధనుష్ నటించిన ‘అసురన్’ ప్రేక్షకులు, ప్రముఖుల నుంచే కాకుండా విమర్శకుల నుంచీ ప్రశంసలు అందుకుంది. కాగా, తెలుగు నేటివిటీకి తగిన విధంగా ‘అసురన్’లో కొన్ని మార్పులు చేసి ‘నారప్ప’ తెరకెక్కించారు. ఇందులో వెంకటేశ్ సరసన ప్రియమణి కనిపించనున్నారు. ప్రకాశ్‌రాజ్, మురళీశర్మ, కార్తిక్ రత్నం కీలకపాత్రలు పోషించారు. మణిశర్మ స్వరాలు అందించారు. సురేశ్ ప్రొడెక్షన్స్ పతాకంపై సురేశ్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. జులై 20న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Fight for what is YOURS… at the right time!#NarappaTrailer out now: https://t.co/KFYzLXugzY
— Venkatesh Daggubati (@VenkyMama) July 14, 2021
Meet #NarappaOnPrime, July 20. @PrimeVideoIN#Priyamani @KarthikRathnam3 #SrikanthAddala #ManiSharma @SureshProdns @theVcreations pic.twitter.com/cWlmQMbXc1
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్‌కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం