‘రాక్షసుడు’ సీక్వెల్..అయితే మన బెల్లంకొండ కాదా??!!
- July 14, 2021బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రమేష్‌వర్మ దర్శకత్వంలో రూపొందిన ‘రాక్షసుడు’ చిత్రం కమర్షియల్‌గా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నది. తాజాగా ఈ చిత్రానికి ‘రాక్షసుడు-2’ పేరుతో సీక్వెల్ తెరకెక్కనున్నది. ఈ సీక్వెల్‌కు రమేష్‌వర్మ దర్శకత్వం వహించబోతున్నారు. ‘హోల్డ్ యువర్ బ్రీత్’ ఉపశీర్షిక. హవీష్ ప్రొడక్షన్స్ పతాకంపై కోనేరు సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టైటిల్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. నిర్మాతలు మాట్లాడుతూ ‘విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న థ్రిల్లర్ చిత్రమిది. తొలి భాగానికి మించి ఉత్కంఠను పంచుతుంది. అగ్ర కథానాయకుడు ఈ సినిమాలో నటించనున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభిస్తాం’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంభాషణలు: శ్రీకాంత్ విస్సా, సాగర్, సంగీతం: జిబ్రాన్, ఛాయాగ్రహణం: వెంకట్ సి దిలీప్.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు