పంజాబ్ పీసీసీ చీఫ్ గా సిద్ధూ!
- July 15, 2021
పంజాబ్ కాంగ్రెస్‌లో నెలకొన్న సంక్షోభాన్ని తెరదించేందుకు ఆ పార్టీ అధిష్ఠానం తీవ్రంగా శ్రమిస్తోంది. సీఎం అమరీందర్ సింగ్-నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ మధ్య విభేదాలను పరిష్కరించి 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షాలను ఉమ్మడిగా ఎదుర్కోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా మాజీ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ డిమాండ్లనూ పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం. మరో రెండు మూడు రోజుల్లో కాంగ్రెస్ హైకమాండ్.. పంజాబ్ పీసీసీ చీఫ్‌గా సిద్ధూని అధికారికంగా ప్రకటించబోతున్నట్లు సమాచారం.
2022 అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా సామాజిక వర్గాల పరంగా అందరినీ సంతృప్తిపరిచేలా పంజాబ్‌లో కాంగ్రెస్ నాయకత్వం ఉండాలని భావిస్తున్న పార్టీ అధిష్ఠానం..పీసీసీ చీఫ్‌తో పాటు, ఇద్దరు కార్యనిర్వాహక అధ్యక్షులను నియమించాలని నిర్ణయించిందని..వీటిలో ఒకటి దళితులకు ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అన్ని స్థాయుల్లోనూ కాంగ్రెస్ సంప్రదింపులు జరిపిందని.. పార్టీ నియామకాల్లో అసమ్మతి నెలకొనేందుకు అవకాశం లేదు అని ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు తెలిపారు. కాగా,పంజాబ్ కాంగ్రెస్ లో కుమ్ములాటల వేళ ఇటీవల అటు సిద్ధూ,ఇటు సీఎం అమరీందర్ సింగ్ ఇద్దరూ గాంధీ ఫ్యామిలీతో సమావేశమయ్యారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఏ నిర్ణయం తీసుకున్న దానికి కట్టుబడి ఉంటానని గత వారం సోనియా గాంధీతో సమావేశం అనంతరం సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
మరోవైపు,సిద్ధూ.. ఆమ్ ఆద్మీ పార్టీలో చేరబోతున్నట్లు రెండు రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం సిద్ధూ చేసిన ఓ ట్వీట్ ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. సిద్దూ తన ట్వీట్ లో.. మా ప్రతిపక్షం ఆప్ పంజాబ్‌పై నా దృక్కోణాన్ని, నేను చేసిన పనులను ఎల్లప్పుడూ గుర్తిస్తూనే ఉంటుంది. 2017కు ముందు నాటి బీద్బీ, డ్రగ్స్, రైతు సమస్యలైనా, ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్ సంక్షోభ సమస్యనైనా లేవనెత్తింది నేనేనని వారికి తెలుసు. పంజాబ్ కోసం పోరాడేది ఎవరో కూడా వారికి స్పష్టంగా తెలుసు అని పేర్కొన్నారు. అయితే సిద్ధూని వదులుకునేందుకు సిద్ధంగా లేని కాంగ్రెన్ ఆయన డిమాండ్లు తీర్చేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పీసీసీ చీఫ్ సునీల్ కుమార్ జక్కర్ ని తొలగించి ఆయన స్థానంలో సిద్ధూని నియమించాలని సోనియాగాంధీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్‌లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!







