సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌కి 24 గంటల జైలు శిక్ష

- March 10, 2016 , by Maagulf
సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌కి 24 గంటల జైలు శిక్ష

సౌదీ అరేబియా ఇంటీరియర్‌ మినిస్ట్రీ, సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ మోటర్‌ వెహికిల్స్‌ డ్రైవింగ్‌ చేసేవారికి 24 గంటల పాటు జైలు శిక్ష విధించేలా చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించింది. 160 కిలోమీటర్ల కన్నా ఎక్కువ వేగంతో రోడ్లపై ప్రయాణం చేస్తే, వారి లైసెన్స్‌ రద్దు చేయబడుతుంది. ఈ నిబంధనల్ని ఉల్లంఘించిన 60 మందికి గత నెలలో పెనాల్టీ విధించడం జరిగింది. అతి వేగంగా వాహనాలు నడిపిన 4 గురు వ్యక్తుల లైసెన్సుల్ని కూడా రద్దు చేశారు. రేడియో ప్రోగ్రామ్‌ ద్వారా సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ గురించీ, రెక్‌లెస్‌ డ్రైవింగ్‌ గురించీ అవగాహన కల్పించే కార్యక్రమంలో పాల్గొన్నారు డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ ట్రాఫిక్‌ బాడీస్‌ కమిషన్‌ హెడ్‌ కల్నల్‌ అబుదల్‌ అజీజ్‌ అల్‌ లుహాయిదాన్‌ మాట్లాడారు. నిబంధనల్ని ఉల్లంఘించేవారికి మూడు మెసేజ్‌లు పంపబడ్తాయనీ, ట్రాఫిక్‌ ఆఫీస్‌ వద్ద వారు హాజరు కాని పక్షంలో, ట్రాఫిక్‌ సర్వీసులనుంచి వారిని సస్పెండ్‌ చేయడం జరుగుతుందని, అలాగే పెనాల్టీ విధించబడుతుందని ఆయన వివరించారు. ఇలాంటి సందర్భాల్లో ఆన్‌లైన్‌ ద్వారా చెల్లింపులకు ఆస్కారం లేకుండా, వ్యక్తిగతంగా హాజరై చలాన్లు చెల్లించేలా 'బ్లాకింగ్‌' అనే మెకానిజంని రూపొందించినట్లు చెప్పారాయన. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com