ఈ ఏడాది గరిష్ట స్థాయికి ద్రవ్యోల్బణం
- July 16, 2021సౌదీ: సౌదీ ద్రవ్యోల్బణం పైపైకి ఎగబాకుతోంది. జూన్ మాసానికి సంబంధించి ద్రవ్యోల్బణ రేటు 6.2 శాతానికి చేరింది. ఈ ఏడాదికిగాను ఇదే అత్యధిక స్థాయి కావటం గమనార్హం. చమురు, అహార పదార్ధాల ధరల్లో పెరుగుదల చోటు చేసుకోవటమే ఇందుకు కారణమని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. స్టాటిస్టిక్స్ జనరల్ అథారిటీ వెల్లడించిన గణాంకాల ప్రకారం గత మేలో సౌదీ ద్రవ్యోల్బణం 5.7 శాతంగా నమోదైంది. ధరల పెరుగుదలకు వ్యాట్ కూడా ఓ కారణంగా మారింది. గతేడాది జులైకి ముందు వ్యాట్ 5 శాతం మాత్రమే ఉండేది. కానీ, జులైలో వ్యాట్ పర్సెంటేజ్ ను 5 శాతం నుంచి 15 శాతానికి పెరిగిన విషయం తెలిసిందే. ఇదిలాఉంటే ఈ ఏడాది సౌదీ ద్రవ్యోల్బణంలో మరింత పెరుగుదల ఉండే అవకాశాలు కూడా ఉన్నట్లు ఆర్ధిక నిపుణులు అంచనా వేస్తున్నారు. గరిష్టంగా 6.3 శాతానికి చేరొచ్చని చెబుతున్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ