ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సిబ్బందికి క్వారంటైన్ నుంచి మినహాయింపు

- July 17, 2021 , by Maagulf
ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సిబ్బందికి క్వారంటైన్ నుంచి మినహాయింపు

ఒమన్: ఒమన్ కు వచ్చే వైద్య సిబ్బంది, వైద్య సహాయక సిబ్బందికి ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ నుంచి మినహాయిపు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సుప్రీం కమిటీ సూచనలకు అనుగణంగా ఈ మేరకు ఒమన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వ్యులు తక్షణమే అమలులోకి తీసుకువస్తున్నట్లు స్పష్టం చేసింది. కొత్త ఉత్వర్వ్యుల మేరకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని వైద్య సిబ్బంది, వైద్య సహాక సిబ్బంది (డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నిషియన్లు, ఫార్మాసిస్టులు, వారి కుటుంబసభ్యులు) హోటల్ క్వారంటైన్ లో ఉండాల్సిన అవసరం లేదు. అయితే..వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం ఎలక్ట్రిక్ బ్రాస్లెట్ తో హోం క్వారంటైన్ మాత్రం తప్పనిసరి అని స్పష్టం చేసింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com