సమ్మర్ వర్క్ బ్యాన్ అమలు తీరుపై మంత్రి ఆకస్మిక తనిఖీలు

- July 17, 2021 , by Maagulf
సమ్మర్ వర్క్ బ్యాన్ అమలు తీరుపై మంత్రి ఆకస్మిక తనిఖీలు

బహ్రెయిన్: బహ్రెయిన్ వ్యాప్తంగా సమ్మర్ వర్క్ బ్యాన్ అమలు తీరును పరిశీలించేందుకు కార్మిక శాఖ మంత్రి జమీల్ హమైదన్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పలు నిర్మాణ రంగంలోని పలు వర్క్ సైట్లకు వెళ్లి కార్మికుల భద్రత కోసం ఆయా యాజమాన్యాలు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. తన పర్యటన తర్వాత సమ్మర్ వర్క్ బ్యాన్ అమలు తీరుపట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. వేసవి ఎండ తీవ్రత నుంచి కార్మికులను రక్షించేందుకు మధ్యాహ్నం వేళల్లో బహిరంగ ప్రాంతాల్లో పనులను నిషేధించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాలను పలు సంస్థలు, యాజమాన్యాలు అమలు చేస్తున్న తీరును ఆయన ప్రశంసించారు. జులై తొలి నుంచి ఇప్పటివరకు బహ్రెయిన్ వ్యాప్తంగా 3,344 చోట్ల తనిఖీలు నిర్వహించగా కేవలం 15 సంస్థల్లోని, 26 మంది కార్మికులు వర్క్ బ్యాన్ రూల్స్ బ్రేక్ చేసినట్లు గుర్తించామన్నారు మంత్రి. అంటే మొత్తంగా 0.4 శాతం మేర నిబంధనల ఉల్లంఘన జరిగిందన్నారు.  సమ్మర్ వర్క్ బ్యాన్ నిబంధన బ్రేక్ చేసిన వారికి మూడు నెలలకు మించకుండా జైలు శిక్ష, BD500 నుంచి BD 1,000 వరకు జరిమానా విధించనున్నట్లు వెల్లడించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com