తెరుచుకున్న శబరిమల అయ్యప్ప ఆలయం
- July 17, 2021
కేరళ: కరోనా రెండో దశ విజృంభణ తర్వాత తొలిసారిగా శబరిమల అయ్యప్ప ఆలయంలోకి భక్తులను అనుమతిస్తున్నారు. ఈ రోజు తెల్లవారుజామున భక్తుల దర్శనార్థం తెరిచారు. అనంతరం సుప్రభాత, ఇతర సేవల దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల పాటు ఆలయంలోకి భక్తులను అనుమతిస్తారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తున్నట్టు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు చెప్పింది. అలాగే, కరోనా టీకా రెండు డోస్‌లు వేసుకున్నవారు, ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టు తీసుకొచ్చిన వారికే అనుమతి ఉంటుందని, దర్శనానికి వచ్చే వారు 72 గంటల ముందు చేయించుకున్న కరోనా పరీక్షను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది. ఇందుకోసం ఇప్పటికే ఆన్‌లైన్ బుకింగ్ సౌకర్యాలు కల్పించారు. ముందుగా టికెట్లు బుక్ చేసుకున్న వారికి అవకాశం కల్పిస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..
- భారత్, న్యూజిలాండ్ ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం
- పవన్ కల్యాణ్‌కు సర్జరీ సక్సెస్..త్వరగా కోలుకోవాలన్న సీఎం చంద్రబాబు!
- వేసవి రద్దీకి దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ సిద్ధం..
- మల్కాజ్గిరి భద్రత, పరిశుభ్రత పై పోలీస్–మున్సిపల్ శాఖల సమన్వయ సమావేశం
- షార్జాలో పర్యాటక రంగానికి భారీ ఊరట..!!
- ఇంట్లోనే అక్రమంగా రెస్టారెంట్..పలు ఉల్లంఘనలు నమోదు..!!
- ఒమన్–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం.. సముద్ర భద్రతపై కీలక చర్చలు..!!







