ఏపీలో కరోనా కేసుల వివరాలు
- July 17, 2021
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 91,594 శాంపిల్స్ పరీక్షించగా… 2,672 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో 18 మంది కరోనా బాధితులు మృతి చెందారు. చిత్తూరు, పశ్చిమ గోదావరిలో ముగ్గురు చొప్పున మృతిచెందగా.. అనంతపురం, తూర్పుగోదావరి, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు చొప్పున, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు. ఇక, ఇదే సమయంలో 2,467 కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారని.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 2,34,88,031 శాంపిల్స్ పరీక్షించామని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. తాజా కేసులు కలుపుకొని మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,37,122కు పెరగగా.. రికవరీ కేసుల సంఖ్య 18,98,966కు చేరింది.. ఇక, కరోనాతో ఇప్పటి వరకు 13,115 మంది మృతిచెందగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 25,041 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తాజా వార్తలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు







