ఏపీలో కరోనా కేసుల వివరాలు

- July 17, 2021 , by Maagulf
ఏపీలో కరోనా కేసుల వివరాలు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు మళ్లీ పెరిగాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో 91,594 శాంపిల్స్‌ పరీక్షించగా… 2,672 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో 18 మంది కరోనా బాధితులు మృతి చెందారు. చిత్తూరు, పశ్చిమ గోదావరిలో ముగ్గురు చొప్పున మృతిచెందగా.. అనంతపురం, తూర్పుగోదావరి, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు చొప్పున, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు. ఇక, ఇదే సమయంలో 2,467 కోవిడ్‌ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారని.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 2,34,88,031 శాంపిల్స్‌ పరీక్షించామని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. తాజా కేసులు కలుపుకొని మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 19,37,122కు పెరగగా.. రికవరీ కేసుల సంఖ్య 18,98,966కు చేరింది.. ఇక, కరోనాతో ఇప్పటి వరకు 13,115 మంది మృతిచెందగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 25,041 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com