అత్యవసర పరిస్థితుల్లో కేవలం 2.33 నిమిషాల్లోనే చేరుకుంటున్న దుబాయ్ పోలీస్
- July 22, 2021దుబాయ్: దుబాయ్ పోలీస్ మూడు నెలల్లో 1.2 మిలియన్ ఫోన్ కాల్స్‌కి స్పందించారు. 999 ఎమర్జెన్సీ హాట్ లైన్ ద్వారా 1.17 మిలియన్ కాల్స్ స్వీకరించారు. నాన్ ఎమర్జెన్సీ 901 నెంబర్ ద్వారా 379,122 కాల్స్ అటెండ్ చేశారు. కేవలం 10 సెకన్లలోనే 99.6 శాతం అత్యవసర కాల్స్‌కి సమాధానమిచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో పెట్రోలు బృందాలు రికార్డు సమయం 2.33 నిముషాల్లోనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వాస్తవానికి 6 నిముషాల సమయాన్ని టార్గెట్‌గా పెట్టుకున్నారు. మరికొన్ని అత్యవసర ప్రాంతాలకు 15 నిముషాల టార్గెట్ పెట్టుకోగా, 10.17 నిముషాల్లోనే చేరుకున్నారు. ఎమర్జెన్సీ కాని కేసులకు సంబంధించి టార్గెట్ 30 నిముషాలు కాగా, 10.45 నిముషాల్లోనే పెట్రోల్స్ చేరుకున్నాయి. 901 కాల్ సెంటర్, ఎమర్జెన్సీ కాని కాల్స్‌ని 20 సెకన్లలోనే 94.42 శాతం అటెండ్ చేసింది.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు