కేటీఆర్ పుట్టిన రోజు స్పెషల్.. వంద మంది దివ్యాంగులకు ఉచిత స్కూటీలు..
- July 22, 2021
హైదరాబాద్: జులై 24న తెలంగాణ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు.. ఈ సందర్భంగా బొకేలు, కేకులు, హోర్డింగులు అంటూ డబ్బుని వృధా చేయవద్దని ఆయన సూచించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ‘గిప్ట్ ఏ స్మైల్’ లో భాగంగా వంద మంది దివ్యాంగులకు ప్రత్యేకమైన ద్విచక్ర వాహనాలను అందించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. గత ఏడాది తాను 6 అంబులెన్స్ లను విరాళంగా ఇవ్వగా.. తెరాస ప్రజా ప్రతినిధులు, నేతలు 90 వాహనాలు ఇచ్చారని గుర్తు చేశారు. అవసరం ఉన్న వారికి వ్యక్తిగతంగా సాయం అందించాలని, వృక్షార్చనలో భాగంగా మొక్కలు నాటాలని తెరాస నేతలు, అనుచరులకు కేటీఆర్ పిలుపునిచ్చారు.
మంత్రి కేటీఆర్ ట్వీట్ చేసిన కాసేపటికే.. టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల నుంచి భారీ స్పందన వస్తోంది. తమ వంతుగా వాహనాలను విరాళం ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కూడా 50 మంది దివ్యాంగులకు స్కూటీలు ఇస్తాన్నట్లు ప్రకటించారు. దయగల మంత్రి కేటీఆర్ సారధ్యంలో పనిచేయడం తమ అదృష్టమన్నారు.. ఆయన అడుగు జాడల్లో నడవటం స్ఫూర్తిదాయకం అంటూ బాల్క సుమన్ ట్వీట్ లో పేర్కొన్నారు. మరింత మంది నేతలు కూడా సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్‌తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్‌లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







