మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు
- March 11, 2016
మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. పోలీసులే లక్ష్యంగా మందు పాతర పేల్చారు. ఈ ఘటనలో 12 మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లాలో కుంట పోలీస్ స్టేషన్ సమీపంలో శుక్రవారం ఉదయం మావోయిస్టులు ఈ ఘటనకు పాల్పడ్డారు. అటవీ ప్రాంతంలో కూంబింగ్ జరుపుతున్న పోలీసులే లక్ష్యంగా చేసుకుని ల్యాండ్ మైన్ పెట్టి పేలుడు కు పాల్పడ్డారు. రెండు వారాల క్రితం జరిగిన మావోయిస్టుల ఎన్ కౌంటర్ కు ప్రతీకారంగానే ఈ చర్యకు పాల్పడినట్టు సమాచారం. ఎటువంటి ప్రాణనష్టం జరగక పోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనలో గాయపడిన 12 మంది పోలీసులకు చికిత్స అందిస్తున్నారు.వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో సమీపంలోని ఖమ్మం జిల్లా భద్రాచలం ఆస్పత్రికి తరలించారు
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







