గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న అమితాబ్, నాగార్జున
- July 27, 2021
హైదరాబాద్: హైదరాబాద్‌లో సినీనటులు అమితాబ్ బచ్చన్, నాగార్జున గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న ఓ సినిమా షూటింగ్‌కు అమితాబ్, ఎన్టీఆర్ హాజరయ్యారు.

ఈ విషయం తెలుసుకున్న సంతోష్ కుమార్ వారి వద్దకు వెళ్లి వారితో మొక్కలు నాటించి ఫొటోలు తీసుకున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో అమితాబ్ ఓ మొక్కను నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గురించి అమితాబ్‌కు సంతోష్ కుమార్ వివరించారు. మంచి కార్యక్రమం చేపట్టారని సంతోష్‌ను అమితాబ్ ప్రశంసించారు ఈ కార్యక్రమంలో నిర్మాత అశ్వనీదత్, ఫిల్మ్‌సిటీ ఎండీ విజయేశ్వరి కూడా పాల్గొన్నారు.
కాగా, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని నాగార్జున కోరారు. సంతోష్ కుమార్ ఇప్పటివరకు 16 కోట్ల మొక్కలు నాటించడం ప్రశంసనీయమని చెప్పారు.
తాజా వార్తలు
- ఇద్దరు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ సెల్స్ అరెస్ట్: ఖతార్
- 166 మిస్సైల్స్, డ్రోన్లను ధ్వంసం చేశాం: బహ్రెయిన్
- కువైట్ పై దాడులకు తెగబడ్డ ఇరాన్..!!
- కువైట్‌లో సైనికుల మృతి పట్ల ఒమన్ సంతాపం..!!
- దౌత్యాధికారులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన సౌదీ అరేబియా..!!
- డిస్టెన్స్ లెర్నింగ్ మార్చి 6 వరకు పొడిగించిన యూఏఈ..!!
- 1,000 కి పైగా ఇరానియన్ దాడులు: యూఏఈ
- అమెరికా కాన్సులేట్ పై డ్రోన్ అటాక్ పై దుబాయ్ క్లారిటీ..!!
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్









