ఆ మృతదేహం ఎవరిది..? ప్రవాసీయుల సాయం కోరిన పోలీసులు

- July 28, 2021 , by Maagulf
ఆ మృతదేహం ఎవరిది..? ప్రవాసీయుల సాయం కోరిన పోలీసులు

దుబాయ్: బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లిన ఓ వ్యక్తి దేశంగానీ దేశంలో ఊపిరి వదిలాడు. కానీ, అతను ఎవరో తెలియదు. ఏ దేశం నుంచి వచ్చాడో తెలియదు.ఎడారి ప్రాంతంలో మృత్యుఒడికి చేరి అనాధ శవంలా మిగిలిపోయాడు. అయితే...అతని వివరాలను తెలుసుకునేందుకు దుబాయ్ పోలీసులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ముహైసినా ప్రాంతంలో ఇసుక తిన్నెల్లో ఆసియన్ మృత దేహం లభించిందని, అయితే..తాను ఎవరనే విషయం తెలియటం లేదన్నారు. మృతదేహం దగ్గర ఎలాంటి గుర్తింపు పత్రాలు పోలీసులకు దొరకలేదు. ఎక్కడా మిస్సింగ్ కేసు కూడా నమోదు కాలేదు. దీంతో మృతుడిని గుర్తించటంలో సహాయపడాలని ప్రవాసీయులను కోరారు దుబాయ్ పోలీసులు. శవపరీక్ష కోసం మృతదేహాన్ని ఫోరెన్సిక్ విభాగానికి తరలించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com