భారత్ కరోనా అప్డేట్
- July 28, 2021
న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి కేసులు తగ్గినట్టే తగ్గి.. మళ్లీ పెరుగుతూ ఆందోళనకు గురిచేస్తున్నాయి.. గత బులెటిన్‌లో 30 వేలకు దిగువకు వెళ్లిపోయిన పాజిటివ్ కేసులు.. ఇవాళ ఏకంగా 43 వేలు దాటేశాయి.కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. దేశవ్యాప్తంగా 17,36,857 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 43,654 మందికి పాజిటివ్‌గా తేలింది. మృతుల సంఖ్య కూడా పెరిగిపోయింది.ఒకేరోజు 640 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 3.14 కోట్లకు చేరగా.. 4,22,022 మంది మృతి చెందారు.ఇక, తాజాగా మరో 41,678 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకోవడంతో.. రికవరీ కేసుల సంఖ్య 3.06 కోట్లకు చేరింది. ప్రస్తుతం 3,99,439 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉండగా.. మరోవైపు ఇప్పటివరకు 44,61,56,659 టీకాలు వేసినట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం.
తాజా వార్తలు
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి







