సోషల్ మీడియాలో వధువు ప్రకటనలు..అడ్మిన్లకు కోర్టు సమన్లు

- July 29, 2021 , by Maagulf
సోషల్ మీడియాలో వధువు ప్రకటనలు..అడ్మిన్లకు కోర్టు సమన్లు

సౌదీ: పెళ్లి చూపులు అంటే ఇప్పుడు మాట్రిమోనీలదే హవా.ఆన్ లైన్లో పెళ్లి చూపులు జరిగిపోతున్నాయి.అయితే..ఈ జోరులో కొందరు దేశ చట్టాలను, మతపరమైన విశ్వాసాలను నిర్లక్ష్యం చేస్తూ కష్టాలు కొనితెచ్చుకుంటున్నారు.సౌదీ అరేబియాలో ఇదే తరహా ఉదంతం చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో వధువు ప్రకనటలు పోస్ట్ చేస్తుండంతో అడ్మిన్లకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ సమన్లు జారీ చేసింది.సోషల్ మీడియాలో వధువు ప్రకటనలు మహిళల గౌరవానికి హాని కలిగించే విధంగా ఉండటమే కాకుండా ఇస్లామిక్ షరియా, దేశ చట్టాలను ఉల్లంఘించటమేనని కోర్టు అభిప్రాయపడింది. ప్రజా నైతిక విలువలు, మతపరమైన నిబంధనలకు విరుద్ధంగా  సోషల్ మీడియాలో వధువు ఫోటో, ఆమె వివరాలతో వస్తున్న ప్రకటనలపై పబ్లిక్ ప్రాసిక్యూషన్ లోని సైబర్ క్రైమ్ ఇన్విస్టిగేషన్ డిపార్ట్మెంట్ విచారణ చేపట్టింది. పలు సోషల్ మీడియాలో ప్రకటలు ఉన్నట్లు నిర్ధారించుకున్న తర్వాత అడ్మిన్లకు కోర్టు సమన్లు జారీ చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com