స్టెరిలైజేషన్ సమయాల్లో బయటికి వస్తే Dh3,000 ఫైన్

- July 29, 2021 , by Maagulf
స్టెరిలైజేషన్ సమయాల్లో బయటికి వస్తే Dh3,000 ఫైన్

అబుధాబి: అబుధాబి వ్యాప్తంగా చేపట్టిన నేషనల్ స్టెరిలైజేషన్ ప్రోగ్రాం కొనసాగుతోందని యూఏఈ వెల్లడించింది.మధ్య రాత్రి నుంచి తెల్లవారుజాము 5 వరకు స్టెరిలైజేషన్ ప్రోగ్రాం ఉంటుంది.ఈ సమయంలో ముందస్తు అనుమతి లేకుండా ఎవరూ బయటికి రాకూడదని అధికారులు హెచ్చరించారు.ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా స్టెరిలైజేషన్ సమాయాల్లో బయటికి వస్తే Dh3,000 ఫైన్ విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు.హెల్త్ ఎమర్జెన్సీ, మెడిసిన్, అహారం కోసం బయటికి వచ్చే వారికి మాత్రం మినహాయింపు ఉంటుంది. అయితే..అబుధాబి పోలీస్ వెబ్ సైట్(https://es.adpolice.gov.ae/trafficservices/) నుంచి ముందస్తుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అధికారుల నుంచి ముందస్తు అనుమతి లేకుండా వస్తే ఫైన్ తప్పదు. 

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com