ఒలింపిక్ హ్యాండ్ బాల్..జపాన్ పై బహ్రెయిన్ విక్టరీ
- July 31, 2021
బహ్రెయిన్: టోక్యో ఒలింపిక్స్ 2020లో బహ్రెయిన్ హ్యాండ్ బాల్ టీం సత్తా చాటింది. గ్రాప్ బీలో భాగంగా నాలుగో రౌండ్లో జపాన్ తో తలపడిన బహ్రెయిన్..32-30తో అతిథ్య దేశాన్ని ఓడించింది. ఒలింపిక్స్ హిస్టరీలో బహ్రెయిన్ కు ఇది తొలి విజయం. యోయోగి నేషనల్ అరేనాలో జరిగిన మ్యాచ్ లో ఫస్టాఫ్ లో జపాన్ డామినేషన్ కొనసాగింది.17-16 జపాన్ ఆధిక్యం సంపాదించింది. కానీ, ఒలింపిక్స్ ఎలాగైన ఫస్ట్ విక్టరీ సాధించాలనే కసితో బహ్రెయిన్ టీం పుంజుకుంది. సెకాండాఫ్ లో జపాన్ తో పోటాపోటీగా తలపడుతూ తర్వాత ఆధిక్యత చాటుకుంది. ఆట ముగిసే సరికి హోస్ట్ కంట్రీ జపాన్ కంటే రెండు పాయింట్లు ఎక్కువ సాధించి 32-30తో హిస్టరీ విక్టరీ సాధించింది. ఇక ఆగస్టు 1 న గ్రూప్ Bలో భాగంగా ఐదవ రౌండ్లో బహ్రెయిన్..ఈజిప్ట్‌తో తలపడనుంది. ఫోర్త్ రౌండ్లో ఓటమి పాలైన జపాన్..పోర్చుగల్ తో పోటీ పడనుంది.
తాజా వార్తలు
- రాచకొండ పోలీసులను అభినందించిన డిజిపి బి.శివధర్ రెడ్డి
- ఏపీ: లోక్ అదాలత్ 2 లక్షల కేసుల పరిష్కారం
- పెమ్మసానికి కీలక బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబు
- లియోనెల్ మెస్సీ జట్టు పై సీఎం రేవంత్ రెడ్డి టీమ్ ఘనవిజయం..
- కాంగ్రెస్ ‘ఓట్ చోరీ’ నిరసన పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ
- నమ్మకం, అభివృద్ధి ద్వారానే శాశ్వత శాంతి..!!
- దుబాయ్‌లో తగ్గిన నేరాల రేటు..ఎకానమీ హైక్..!!
- గ్లోబల్ పాస్‌పోర్ట్ పవర్ ర్యాంక్ 2025: యూఏఈ టాప్..ఖతార్ స్ట్రాంగ్..!!
- కువైట్ లో అత్యధికంగా 24.3 మి.మీ వర్షపాతం..!!
- ధురంధర్ కు గల్ఫ్ దేశాలలో అనుమతి నిరాకరణ..!!







