విజయ్ మాల్యాతో సినీనటుడు అల్లరి నరేష్ సెల్ఫీ
- March 12, 2016
వివిధ బ్యాంకులకు దాదాపు రూ.9వేల కోట్లు బకాయిపడి... దేశం విడిచి వెళ్లిపోయారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కింగ్‌ఫిషర్ యజమాని, రాజ్యసభ సభ్యుడు విజయ్‌మాల్యా వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. మాల్యా వ్యవహారంపై దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. పార్లమెంట్‌లో కూడా అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం సాగింది. సీబీఐ అధికారులు, బ్యాంకు అధికారులకు చిక్కకుండా తప్పించుకుని విదేశాల్లో ఉన్న విజయ్ మాల్యాతో సినీనటుడు అల్లరి నరేష్ సెల్ఫీ తీసుకున్నారు.మాల్యాతో కలిసి దిగిన ఫొటోను శనివారం ఉదయం అల్లరి నరేష్ తన ఫేస్‌బుక్, ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ఇదేంటి మాల్యాతో అల్లరి నరేశ్ అని అందరూ ఆశ్చర్యపోయారు. ఇటీవల మాల్యా విదేశాలకు వెళ్లే సమయంలో తనకు తారసపడ్డాడని, బ్యాంకులకు చిక్కని మాల్యా తనకు చిక్కడం ఆనందంగా ఉందని నరేశ్ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. వెండితెరపైనే కాకుండా రియల్‌గానూ నరేశ్ ఇలా... వినోదాన్ని పంచుతున్నారన్నమాట!. మాల్యా ఈనెల 2న విదేశాలకు వెళ్లినట్లుగా అధికారులు భావిస్తున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్‌తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్‌క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్‌లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్‌లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









