సౌదీ విమానాల్ని తదుపరి నోటీసు వరకు రద్దు చేసిన ఎతిహాద్

- August 02, 2021 , by Maagulf
సౌదీ విమానాల్ని తదుపరి నోటీసు వరకు రద్దు చేసిన ఎతిహాద్

యూఏఈ: ఎతిహాద్ ఎయిర్ వేస్, సౌదీ అరేబియాకి వెళ్ళే అలాగే, సౌదీ అరేబియా నుంచి వచ్చే విమానాల్ని రద్దు చేసినట్లు వెల్లడించింది.తదుపరి ప్రకటన వచ్చేదాకా ఈ రద్దు ఆదేశాలు అమల్లో వుంటాయి.కనీసం ఆగస్ట్ 10వ తేదీ వరకు ఈ నిషేధం కొనసాగుతుందని ఎతిహాద్ తెలిపింది.సౌదీ అరేబియా ఇటీవల విడుదల చేసిన సూచనల నేపథ్యంలో తమ సేవల్ని తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్లు ఎతిహాద్ సంస్థ వివరణ ఇచ్చింది.ఇప్పటికే టిక్కెట్లు పొందిన ప్రయాణీకులు,ఆయా ఏజెన్సీలను సంప్రదించాల్సిందిగా ఎతిహాద్ సూచించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com