కార్నిచ్ రోడ్డు మూసివేత..ప్రత్యామ్నాయంగా మెట్రో షురూ
- August 03, 2021
ఖతార్: అభివృద్ధి పనుల్లో భాగంగా కార్నిచ్ రోడ్డును మూసివేయనున్నారు.దీంతో ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయంగా మెట్రో సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు దోహా మెట్రో వెల్లడించింది.ఆగస్ట్ 6, 2021(శుక్రవారం) నుంచి ఆగస్ట్ 10 మంగళవారం ఉదయం గంటల వరకు కార్నిక్ రోడ్డును తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.అయితే..శుక్రవారం రోజున మాత్రం మధ్యాహ్నం 2 నుండి 23:59 వరకు ప్రయాణికుల కోసం దోహా మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి.ఆగస్ట్ 6న మొత్తం 37 మెట్రో స్టేషన్‌లు తెరిచి ఉంటాయని దోహా మెట్రో వివరించింది. అయితే..ఆగస్ట్ 13, 23 రోజుల్లో నెట్‌వర్క్ సామర్థ్యాన్ని,ఫ్రీక్వెన్సీని పెంచడానికి అవసరమైన మెట్రో సిస్టమ్ అప్‌గ్రేడ్ పనులు ఉంటాయని...అందువల్ల ఆ రెండు రోజులు మెట్రో సేవలు నిలిపివేయబడతాయని వివరించింది.
తాజా వార్తలు
- ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టుల మృతి
- మిస్సోరీలో NATS ఉచిత వైద్య శిబిరం
- దుబాయ్ లో నాలుగు రోజులపాటు సెలవులు..!!
- యూఎన్ గాజా పునర్నిర్మాణం.. బహ్రెయిన్ మద్దతు..!!
- కువైట్లో 50 ఇల్లీగల్ క్యాంప్స్ తొలగింపు..!!
- ఒమన్ లో ఖైదీలకు క్షమాభిక్ష..!!
- చైల్డ్ స్టే సేఫ్.. జర్నీ ఆఫ్ సేఫ్టీ గేమ్ ప్రారంభం..!!
- నాటోయేతర మిత్రదేశంగా సౌదీ.. ట్రంప్
- ఆస్ట్రేలియాలో BMW ప్రమాదం..8 నెలల గర్భిణితో ఉన్న భారతీయ మహిళ మృతి
- ఏపీలో హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులు







