ఆగష్టు 5 నుండి ప్రవాసీయులకి అనుమతి
- August 03, 2021
యూఏఈ: ఇండియా తో వివిధ దేశాల్లో చిక్కుకున్న ప్రవాసీయులు ఎప్పుడెప్పుడు యూఏఈ తమను అనుమతిస్తుందా అని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. వీరికి గుడ్ న్యూస్ చెప్పింది యూఏఈ యంత్రాంగం. ఆగస్టు 5 నుండి UAE లోకి ప్రవేశించడానికి అనుమతించబడతారని అధికారులు మంగళవారం ప్రకటించారు. అయితే, చెల్లుబాటు అయ్యే UAE రెసిడెన్సీ వీసాలు ఉండి, యూఏఈ ఆమోదించిన వ్యాక్సిన్ల రెండు డోసులను పూర్తిచేసుకున్న నివాసితులు మాత్రమే యూఏఈ వచ్చేందుకు అర్హులు అని జాతీయ అత్యవసర సంక్షోభం మరియు విపత్తుల నిర్వహణ సంస్థ (NCEMA) తెలిపింది.
ప్రయాణానికి ముందు వ్యాక్సిన్ రెండవ డోసు పూర్తై కనీసం 14 రోజులు అయ్యి ఉండాలి అని అధికార యంత్రాంగం తెలిపింది. అలాగే, ప్రయాణికులు తమ వ్యాక్సిన్ ధృవీకరణ పత్రాన్ని కలిగి ఉండాలి.
యూఏఈ లో ఆమోదించబడిన వ్యాక్సిన్లు ఇవి:
- ఫైజర్
- ఆస్ట్రాజెనెకా లేదా కోవిషీల్డ్
- సినోఫార్మ్
- స్పుత్నిక్
- మోడెర్నా
వీరికి మాత్రం మినహాయింపు:
వ్యాక్సిన్లు తీసుకున్నారా లేదా అనే దానితో సంబంధం లేకుండా యూఏఈ లో పనిచేసే వైద్యులు, నర్సులు మరియు సాంకేతిక నిపుణులు ఈ ప్రయాణ నిషేధం నుండి మినహాయించబడ్డారు. అలాగే విద్యా రంగంలో పనిచేస్తున్న నివాసితులు, విద్యార్థులు, ప్రభుత్వ సంస్థలలో పనిచేసే కార్మికులు కూడా అనుమతించబడ్డారు. యూఏఈ లో చికిత్స పూర్తి చేయాల్సిన వారు కూడా మినహాయించబడిన వర్గంలో ఉన్నారు.
మినహాయించబడిన అన్ని వర్గాలు అవసరమైన అనుమతులు పొందేందుకు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ సిటిజన్‌షిప్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. సమర్థులైన అధికారులు ఆమోదించిన టీకా సర్టిఫికెట్లను వారు అప్లికేషన్‌తో పాటు జతపరచాలి.
వారు బయలుదేరిన తేదీ నుండి 48 గంటలలోపు గుర్తింపు పొందిన లాబరేటరీల నుండి నెగటివ్ PCR పరీక్షను సమర్పించాలి. ఈ పత్రంలో QR కోడ్‌ని కలిగి ఉండాలి. తిరిగి యూఏఈ చేరగానే పిసిఆర్ పరీక్ష చేయించుకొని హోమ్ క్వారంటైన్ చేయాలి.
#الطوارئ_والأزمات و #الطيران_المدني تعلنان عن استثناء فئات جديدة من المسافرين من بعض الدول التي تم منع القدوم منها والتي تشمل كلاً من الهند وباكستان وسيريلانكا والنيبال ونيجيريا وأوغندا وذلك اعتباراً من تاريخ 5 أغسطس.#يدا_بيد_نتعافى pic.twitter.com/NB2hEJdKzN
— NCEMA UAE (@NCEMAUAE) August 3, 2021
తాజా వార్తలు
- మానవ అక్రమ రవాణా, వీసా ట్రేడింగ్..ఆఫీసుపై రైడ్స్..!!
- సౌదీ బస్సు ప్రమాదం నుంచి బయటపడ్డా..తల్లిదండ్రులను కోల్పోయాడు..!!
- బహ్రెయిన్-నాటో సంబంధాల్లో కొత్త అధ్యాయం..!!
- బౌషర్‌లో శాంతికి భంగం..122 మంది అరెస్ట్..!!
- ఖలీఫా అల్ అత్తియా ఇంటర్చేంజ్ మూసివేత..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్‌ను స్వాగతించిన ట్రంప్..!!
- సల్మాన్ ఖాన్ కేసులో నిందితుడు అన్మోల్ ఇండియాకు అప్పగింత
- ధర్మ ధ్వజం: అయోధ్య నూతన వైభవం
- టీటీడీకి రూ.2 కోట్లు విరాళం
- సహాంలో పది మంది అరెస్టు..!!







