ఏపీలో కరోనా కేసుల వివరాలు
- August 03, 2021
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి.అయితే, గత బులెటిన్‌తో పోలిస్తే.. తాజా బులెటిన్‌లో టెస్ట్‌ల సంఖ్య పెరిగింది.కానీ, పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం ఎటూ కదలలేదు.ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 69,606 శాంపిల్స్ పరీక్షించగా 1,546 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో 18 మంది కరోనా బాధితులు ప్రాణాలు వదిలారు.. చిత్తూరులో నలుగు, కృష్ణా జిల్లాలో ముగ్గురు, అనంతపురం, తూర్పు గోదావరి, గుంటూరు, నెల్లూరులో ఇద్దరు చొప్పున.. ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నంలో ఒక్కరు చొప్పున తాజాగా మరణించారు.
దీంతో.. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 19,71,554కు చేరగా… పూర్తిస్థాయిలో కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 19,37,956కు పెరిగింది.. ఇక, కోవిడ్‌తో ఇప్పటి వరకు 13,428 మంది మరణించగా.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 20,170గా ఉందని బులెటిన్‌లో పేర్కొంది ఏపీ ప్రభుత్వం.
తాజా వార్తలు
- సల్మాన్ ఖాన్ కేసులో నిందితుడు అన్మోల్ ఇండియాకు అప్పగింత
- ధర్మ ధ్వజం: అయోధ్య నూతన వైభవం
- టీటీడీకి రూ.2 కోట్లు విరాళం
- సహాంలో పది మంది అరెస్టు..!!
- FIFA అరబ్ కప్ టికెట్ అమ్మకాలు నిలిపివేత..!!
- రిథమిక్ జిమ్నాస్టిక్స్ లో మెరిసిన 9 ఏళ్ల భారతీయ బాలిక..!!
- బహ్రెయిన్ లో గ్లోబల్ ఫుడ్ షో..!!
- యూఏఈలో లోన్ల పై సాలరీ పరిమితి ఎత్తివేత..!!
- వచ్చెనెల 30 నుంచి పది రోజుల పాటు వైకుంఠద్వార దర్శనాలు: TTD ఛైర్మన్
- శంకర నేత్రాలయ USA మిల్వాకీ కార్యక్రమం విజయం 770 మందికి కంటి చూపు







