ఇండియా - యూఏఈ ప్రయాణం...పలు సూచనలు జారీ

- August 03, 2021 , by Maagulf
ఇండియా - యూఏఈ ప్రయాణం...పలు సూచనలు జారీ

యూఏఈ: యూఏఈ వెలుపల చిక్కుకున్న ప్రవాసీయులు ఆగష్టు 5 నుండి యూఏఈ కు తిరిగిరావచ్చు అని ప్రకటించిన నేపథ్యంలో ప్రయాణీకులకు సూచనలు జారీ చేసింది ప్రభుత్వం. దేశానికి తిరిగి వచ్చే యూఏఈ నివాసితులు తమ విమాన టిక్కెట్లను బుక్ చేసుకునే ముందు షరతులను క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలని ట్రావెల్ ఏజెంట్లు సూచించారు. 

మొదటగా నెగటివ్ పిసిఆర్ పరీక్ష రిపోర్ట్ పొందడం, తర్వాత 'ఫెడరల్ అథారిటీ ఆఫ్ ఐడెంటిటీ అండ్ సిటిజన్‌షిప్' (ICA) వెబ్‌సైట్ (https://uaeentry.ica.gov.ae) లో ప్రయాణానికి సంబంధించి అనుమతి ను తనిఖీ చేయడం ముఖ్యం. క్యూఆర్ కోడెడ్ పిసిఆర్ పరీక్ష ఫలిత ధృవీకరణ పత్రాలు మాత్రమే అంగీకరించబడతాయి. ఇక, ప్రయాణీకులు తమ టిక్కెట్లను బుక్ చేసుకునే ముందు దశల వారీ ప్రక్రియను అనుసరించాలి అని సలహా ఇస్తున్నారు ట్రావెల్ ఏజెంట్లు...

దశల వారీ ట్రావెల్ గైడ్:
దశ 1: దుబాయ్ మినహా అన్ని ఎమిరేట్‌లకు ప్రయాణించే ప్రయాణీకులు తప్పనిసరిగా https://uaeentry.ica.gov.ae లో తమ పత్రాల చెల్లుబాటును తనిఖీ చేయాలి. తప్పనిసరిగా వారి ఎమిరేట్స్ ID నంబర్, పాస్‌పోర్ట్ నంబర్, జాతీయతను నమోదు చేయాలి. మీ పత్రాలు చెల్లుబాటు అయినట్లయితే ICA నుండి 'గ్రీన్' స్టేటస్/మెసేజ్ లభిస్తుంది. ఒకవేళ 'రెడ్' ICA స్టేటస్/మెసేజ్ వచ్చినట్లైతే, మీరు మీ ప్రయాణాన్ని కనీసం 30 నుండి 60 రోజుల వరకు (లేదా ICA లో సూచించిన విధంగా తగినన్ని రోజులు) వాయిదా వేసుకోవాలి అని అధికారులు తెలిపారు. దుబాయ్ నివాసితులు మాత్రం 'జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారిన్ అఫైర్స్' (GDRFA) నుండి ప్రయాణానికి ముందు ఆమోదం పొందాలి.

దశ 2: మీరు ICA నుండి 'గ్రీన్' స్టేటస్ లేదా GDRFA నుండి ఆమోదం పొందిన తర్వాత, ప్రయాణించదలచిన విమానయాన సంస్థ వారి నియమాలు మరియు నిబంధనలను చూడండి. అలాగే, విమానాశ్రయ నిబంధనలను కూడా చెక్ చేయటం మర్చిపోకండి. 

దశ 3: మీ స్వదేశంలో ప్రయాణానికి ముందు ఆమోదాలు ఉన్నాయో లేదో తనిఖీ చేయండి.

దశ 4: యూఏఈ లేదా స్థానిక అధికారులు ఆమోదించిన కేంద్రాల నుండి కోవిడ్ పరీక్ష చేయించుకోండి.

దశ 5: మీరు కోవిడ్ -19 నెగటివ్ పరీక్ష ఫలితాన్ని అందుకున్న తర్వాత, టిక్కెట్లను బుక్ చేసుకోండి.

దశ 6: ప్రయాణ రోజున, ఆరోగ్య ప్రకటన ఫారమ్‌పై సంతకం చేయండి. అలాగే UAE యొక్క హెల్త్ యాప్ AlHosn ని డౌన్‌లోడ్ చేయండి. దుబాయ్ నివాసితులు తప్పనిసరిగా DXB స్మార్ట్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

దశ 7: ప్రయాణానికి PPE కిట్‌లు, హ్యాండ్ శానిటైజర్‌లు మరియు ఇతర రక్షణ పరికరాలను తీసుకెళ్లండి. విమానాశ్రయానికి త్వరగా చేరుకోండి.

గమనిక: విసిట్ వీసా గలవారు తప్పనిసరిగా కోవిడ్ -19 బీమా కలిగి ఉండాలి.
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com