ఎలక్ట్రానిక్ విధానంలో మాత్రమే వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్
- August 03, 2021
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కేవలం ఎలక్ట్రానిక్ విధానంలో మాత్రమే జరుగుతుందని మరోమారు స్పష్టం చేసింది. వలసదారులు, తమ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్, మినిస్ట్రీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి వుంటుందనీ, దాన్ని ప్రత్యేకంగా ఓ కమిటీ పరిశీలించి, వివరాలు సరిగ్గా వుంటే ఆమోద ముద్ర వేసి, గ్రీన్ స్టేటస్ అందిస్తుందని అధికారులు తెలిపారు. ఇది తప్ప ఆఫ్‌లైన్ విధానంలో వెరిఫికేషన్ ప్రక్రియ వుండబోదని మినిస్ట్రీ తేల్చి చెప్పింది. పెద్ద సంఖ్యలో వ్యాక్సిన్ సర్టిఫికెట్లు వస్తున్నందున, వాటిని పరిశీలించడంలో కొంత జాప్యం జరుగుతున్న మాట వాస్తవమేననీ, అధికారులు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారని మినిస్ట్రీ పేర్కొంది.
తాజా వార్తలు
- ఖతార్ స్కాలర్షిప్..850 మంది విద్యార్థులకు ప్రయోజనం..!!
- 'నిరం 2025' మెగా ఈవెంట్ టిక్కెట్లు ఆవిష్కరణ..!!
- ఇంటీరియర్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో వాహనాలు ధ్వంసం..!!
- 22 మంది ఆసియా దేశాల మహిళలు అరెస్టు..!!
- ఇద్దరు చైనీయులను రక్షించిన సౌదీ సిటిజన్..!!
- యూఏఈలో ఉద్యోగులకు 4 రోజుల పాటు సెలవులు..!!
- మృతుల కుటుంబాలకు సీఎం రేవంత్ సర్కార్ రూ.5 లక్షలు పరిహారం
- కేబినెట్ సెక్రటేరియట్ DFO రిక్రూట్మెంట్ 2025
- ఒకే కుటుంబంలో 18 మంది మృతి
- ఈ దేశ పౌరులకు గ్రీన్ కార్డు బ్యాన్ చేసిన ట్రంప్







