కోవిడ్ తీవ్రత ఎక్కువ దేశాల ప్రవాసీయులకు నో ఎంట్రీ

- August 05, 2021 , by Maagulf
కోవిడ్ తీవ్రత ఎక్కువ దేశాల ప్రవాసీయులకు నో ఎంట్రీ

కువైట్: విదేశాల నుంచి వచ్చే ప్రవాసీయుల ప్రవేశ అనుమతికి సంబంధించి మరోసారి కువైట్ ప్రభుత్వం మరోసారి క్లారిటీ ఇచ్చింది. కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రవాసీయులకు అనుమతి ఉండదని స్పష్టం చేసింది. అయితే..డాక్టర్లు, దౌత్యవేతలు, కోవిడ్ కమిటీ నుంచి ముందస్తు అనుమతి పొందిన వారికి మాత్రం అనుమతి ఉంటుంది. ప్రస్తుతం కువైట్ కోవిడ్ హై రిస్క్ దేశాల జాబితాలో ఇండియా, నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక ఉన్నాయి. ఆయా దేశాల నుంచి ప్రవాసీయులకు డైరెక్ట్ ఎంట్రీకి అనుమతి ఇవ్వాలా..వద్దా అనే నిర్ణయాన్ని మంత్రిత్వ శాఖ భవిష్యత్తులో ప్రకటించనుంది. ఇదిలాఉంటే ప్రస్తుతం కువైట్ ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టులో రోజుకు గరిష్టంగా 5000 వరకు పెంచినా..గత కొద్ది రోజులుగా దేశంలోకి వచ్చే ప్రయాణికుల సంఖ్య గరిష్ట స్థాయికి చేరలేకపోతోంది. కొద్ది రోజులుగా రోజుకి 3000 మంది వరకు మాత్రమే కువైట్ వస్తున్నట్లు అధికార వర్గాల సమాచారం. 

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com