మెట్రోరైల్‌ రెండో దశను చేపట్టేందుకు ప్రభుత్వం కృతనిశ్చయం

- March 12, 2016 , by Maagulf
మెట్రోరైల్‌ రెండో దశను చేపట్టేందుకు ప్రభుత్వం కృతనిశ్చయం

రాజధానిలో మెట్రోరైల్‌ రెండో దశను చేపట్టేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. తెలంగాణ శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఐదు మార్గాల్లో మెట్రో రైలును పొడిగించేందుకు అధ్యయనం చేశామన్నారు. మియాపూర్‌-పటాన్‌చెరు, ఎల్బీనగర్‌-హయత్‌నగర్‌, నాగోలు-ఎల్బీనగర్‌, తార్నాక- ఈసీఐఎల్‌, రాయదుర్గం-శంషాబాద్‌ మార్గాల్లో 83 కిలోమీటర్ల మేర మెట్రో రైల్‌ను విస్తరిస్తామని తెలిపారు. ఎంఎంటీఎస్‌ రెండో దశను ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి వరకు పొడిగిస్తామని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com