దోఫార్‌లో ఉద్యోగ ఖాళీలు: 300 మందికి పైగా దరఖాస్తుదారుల పార్టిసిపేషన్

- August 06, 2021 , by Maagulf
దోఫార్‌లో ఉద్యోగ ఖాళీలు: 300 మందికి పైగా దరఖాస్తుదారుల పార్టిసిపేషన్

మస్కట్: గవర్నమెంట్ ఆఫ్ దోహార్‌లోని పలు ప్రభుత్వ యూనిట్లలో ఉద్యోగాల కోసం 300 మంది ఉద్యోగార్థులు పోటీ పడ్డారు. అత్యున్నత టెస్ట్ రిజల్ట్స్ ఆధారంగా అభ్యర్థులు నేరుగా నామినేట్ చేయబడతారు. మొత్తం 334 మంది ఉద్యోగార్థులు, వేర్వేరు అర్హతలతో, పలు ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పడినట్లు అధికారులు తెలిపారు. టెక్నికల్ కాలేజ్ ఆఫ్ సలాలాలో వీరికి పరీక్ష నిర్వహించారు. ఆరు పీరియడ్లుగా వీరిని విభజించి రెండు రోజులపాటు పరీక్షలు జరిపారు. పరీక్ష పూర్తి చేసుకుని, మంచి ఫలితాలు సాధించినవారు ఉద్యోగాలకు అర్హత సాధించగలుగుతారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com