మదీనాలో క్వారంటైన్ ఉల్లంఘనులు 47 మంది అరెస్ట్

- August 07, 2021 , by Maagulf
మదీనాలో క్వారంటైన్ ఉల్లంఘనులు 47 మంది అరెస్ట్

మదీనా: అథారిటీస్, మదీనాలో 47 మంది వ్యక్తుల్ని ఐసోలేషన్ మరియు క్వారంటైన్ నిబందనల ఉల్లంఘనల నేపథ్యంలో అరెస్ట్ చేయడం జరిగింది. మదీనా పోలీస్ అధికార ప్రతినిథి లెఫ్టినెంట్ కల్నల్ హుస్సేన్ అల్ కహ్తానీ మాట్లాడుతూ, సెక్యూరిటీ అథారిటీస్ నిబంధనల ఉల్లంఘన విషయమై అప్రమత్తంగా వుంటున్నాయని పేర్కొన్నారు. నిందితులపై ప్రాథమిక చర్యల అనంతరం, వారిని సంబంధిత అథారిటీస్‌కి అప్పగించామని తెలిపారు. కోవిడ్ 19 నిబంధనల్ని ఉల్లంఘిస్తే 200,000 సౌదీ రియాల్స్ వరకు జరీమానా, 2 ఏళ్ళ వరకు జైలు శిక్ష ఎదుర్కోవాల్సి వస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com