షార్జా ప్రమాదంలో ముగ్గురు భారతీయ స్టూడెంట్స్‌ మృతి

- March 12, 2016 , by Maagulf
షార్జా ప్రమాదంలో ముగ్గురు భారతీయ స్టూడెంట్స్‌ మృతి

షార్జాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ స్టూడెంట్స్‌ మృతి చెందారు. అల్‌ దామ్‌లో ఈ యాక్సిడెంట్‌ జరిగింది. అష్మిద్‌ అష్రాఫ్‌, షిఫామ్‌ ముస్తఫా మరియు మహమ్మద్‌ సునూన్‌గా మృతి చెందినవారిని గుర్తించారు. ఈ ముగ్గురూ భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి చెందినవారు. అల్‌ మదామ్‌లో స్నేహితుడ్ని కలిసి, తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ముగ్గురూ ప్రమాద స్థలంలోనే మృతి చెందారు. ప్రమాద సమయంలో మొత్తం ఆరుగురు కారులో ప్రయాణిస్తున్నారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. దుబాయ్‌లో అష్మిద్‌ తండ్రి అష్రాఫ్‌ రెస్టారెంట్‌ని నడుపుతున్నారు. పరీక్షల కోసం అష్మిద్‌ వారం రోజుల క్రితమే షార్జాకి వచ్చాడు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com