భారత్‌లో నివసించే విదేశీయులకు శుభవార్త...

- August 09, 2021 , by Maagulf
భారత్‌లో నివసించే విదేశీయులకు శుభవార్త...

న్యూఢిల్లీ: భారతదేశంలో నివసిస్తున్న విదేశీయులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వాళ్లు తమ పాస్‌పోర్టులను చూపించి కొవిన్ పోర్టల్‌ https://www.cowin.gov.in/ లో రిజిస్టర్ చేసుకోవడానికి అనుమతిలిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయ ట్విటర్ వేదికగా ఒక ప్రకటన చేశారు.ఈ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకున్న వారికి వ్యాక్సినేషన్ స్లాట్ అలాట్ అవుతుంది. ఆపై వాళ్లు వ్యాక్సిన్ తీసుకునే వెసులుబాటు కలుగుతుంది. భారతదేశంలో భారీ సంఖ్యలో విదేశీయులు నివసిస్తున్నారని, వారికి వ్యాక్సిన్ అందజేయడం చాలా అవసరమని ఈ సందర్భంగా ఆరోగ్యశాఖ అభిప్రాయపడింది.తద్వారా విదేశీయుల జనాభా ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చని పేర్కొంది.

అధిక జనాభా ఉండే ప్రాంతాల్లో కరోనా వ్యాప్తిని నివారించడంలో ఇది చాలా కీలకమైన అడుగని తెలిపింది. వ్యాక్సిన్ తీసుకొని విదేశీయుల వల్ల వైరస్ వ్యాపించకుండా కూడా ఈ నిర్ణయం నియంత్రిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. కాగా, భారత్‌లో 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరికీ వ్యాక్సిన్ అందించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా ప్రభుత్వం వ్యాక్సినేషన్ డ్రైవ్ నడుపుతున్న సంగతి తెలిసిందే. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com