బంగారు విక్రయ దుకాణాల్లో కార్మికులకు ప్రొఫెషనల్ అనుమతులు తప్పనిసరి

- August 11, 2021 , by Maagulf
బంగారు విక్రయ దుకాణాల్లో కార్మికులకు ప్రొఫెషనల్ అనుమతులు తప్పనిసరి

రియాద్: మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ మరియు సోషల్ డెవలప్మెంట్ ఇంజనీర్ అహ్మద్ అల్ రాజి, ఓ ఆర్డర్ విడుదల చేశారు. దీని ప్రకారం గోల్డ్ మరియు జ్యుయెలరీ విక్రయ దుకాణాల్లో కార్మికులకు ప్రొఫెషనల్ వర్క్ పర్మిట్లు తప్పనిసరి. ఈ నిర్ణయం అమల్లోకి వచ్చేందుకోసం ఆరు నెలల గ్రేస్ పీరియడ్ ఇచ్చారు. అనుమతుల నిమిత్తం కొన్ని నిబంధనలు కూడా పేర్కొన్నారు. కార్మికుడు తప్పనిసరిగా సౌదీ జాతీయత కలిగి వుండాలి. చేస్తున్న పనికి సంబంధించి ప్రొఫెషనల్ స్కిల్స్ వుండాలి. మినిస్ట్రీ వెబ్‌సైట్‌లో పేర్కొన్న విధంగా నిబంధనలకు అనుగుణంగా వుండాలి. ఏడాదిపాటు లైసెన్స్ వుంటుంది. ఆ తర్వాత దాన్ని రెన్యువల్ చేసుకోవచ్చు. ఈ రంగంలో సామర్థ్యాన్ని పెంచే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com