ఈ నెల 20న విడుదల కానున్న ‘బజార్ రౌడీ’

- August 14, 2021 , by Maagulf
ఈ నెల 20న విడుదల కానున్న ‘బజార్ రౌడీ’

హైదరాబాద్: బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా కెఎస్ క్రియేషన్స్ పతాకంపై బోడెంపూడి కిరణ్ కుమార్ సమర్పణలో తెరకెక్కిన సినిమా ‘బజార్ రౌడి’. వసంత నాగేశ్వరరావు దర్శకత్వంలో సంధిరెడ్డి శ్రీనివాసరావు నిర్మించారు. ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్‌ తో ఆకట్టుకున్నాడు ‘బజార్ రౌడీ’. ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. U/A సర్టిఫికేట్ తో రానుంది. పెద్దలు, పిల్లలు అందరూ సినిమా చూడొచ్చని సెన్సార్ వారు చెప్పారని, సినిమా చూస్తున్నంత సేపు హాయిగా నవ్వుకోవచ్చని యూనిట్ అంటోంది. మరుధూరి రాజా ఈ సినిమాకు మాటలు రాశారు. గౌతంరాజు ఎడిటింగ్ చేసిన ఈ సినిమాకు SS ఫ్యాక్టరీ సంగీతం… విజయ్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. ఆగస్ట్ 20న ఈ సినిమా విడుదల కానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com