1000 దినార్లకు రెసిడెన్సీ రెన్యూవల్..60 ప్లస్ వారికి వర్తింపు

- August 15, 2021 , by Maagulf
1000 దినార్లకు రెసిడెన్సీ రెన్యూవల్..60 ప్లస్ వారికి వర్తింపు

కువైట్: యూనివర్సిటీ డిగ్రీ లేకుండా 60 ఏళ్లు పైబడిన వారి రెసిడెన్సీ రెన్యూవల్ కోసం మంత్రి మండలి కొత్త ప్రతిపాదనతో ముందుకు వస్తోంది. రెసిడెన్సీ రెన్యూవల్ ను 1000 దినార్లకు తగ్గిస్తూ కౌన్సిల్ నివేదిక సిద్ధం చేసింది. ఇంతకుముందు 60 ఏళ్లు దాటిన వారికి రెసిడెన్సీ రెన్యూవల్ చేయాలంటే 2000 దినార్లు చెల్లించాలని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే..ఆ మొత్తాన్ని ఇప్పుడు సగానికి తగ్గించటం విశేషం. ఈ వెయ్యి దినార్లలో స్టేట్ ఫీజు, హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ కానున్నాయి. 60 ఏళ్లకుపైబడిన వారికి అధిక బీమా ఛార్జీల కారణంగా బీమా పాలసీ ధర 500 దీనార్ల విలువ ఉంటుందని కౌన్సిల్ నివేదిక పేర్కొంది. బీమా పొందిన వారు ప్రైవేట్ రంగంలోని ఏ ఆస్పత్రిలోనైనా చికిత్స పొందవచ్చు. అయితే..దీనిపై త్వరలోనే తుది నిర్ణయం వెలువరించే అవకాశాలు ఉన్నాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com