హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

- August 15, 2021 , by Maagulf
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

హైదరాబాద్: భారతదేశం 75 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని నేడు GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా,GMR హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ ప్రదీప్ పణికర్, CEO-GHIAL జాతీయ జెండాను ఎగురవేశారు.ఈ కార్యక్రమంలో M.K సింగ్, DIG & చీఫ్ ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ ఆఫీస్ (CASO), CISF, కూడా పాల్గొన్నారు.

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో భాగంగా CISF బృందం ఎమర్జెన్సీ రెస్క్యూ అండ్ ప్రొటెక్షన్ డ్రిల్ ను ప్రదర్శించింది.CISF డాగ్ స్క్వాడ్ నైపుణ్యాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. కోవిడ్ మహమ్మారి మధ్య విమానాశ్రయంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని అత్యంత జాగ్రత్తలతో జరుపుకున్నారు.కార్యక్రమం అంతటా సామాజిక దూరం, మాస్క్ ధరించడం, శానిటైజేషన్ జాగ్రత్తలు తీసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com