ఆఫ్గాన్ పరిస్థితులపై ఖతార్ ఆవేదన..శాంతిస్థాపన జరగాలని పిలుపు
- August 16, 2021
దోహా: ఆఫ్గనిస్తాన్ లో చెలరేగుతున్న హింసాత్మక పరిస్థితులపై ఖతార్ ప్రభుత్వం ఆవేదన వ్యక్తం చేసింది. ఆఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్లో వేగంగా జరుగుతున్న పరిణామాలను తాము నిశితంగా పరిశీలిస్తుని పేర్కింది.ఆఫ్గాన్ అంతటా తక్షణమే శాశ్వత కాల్పుల విరమణకు పిలుపునిస్తున్నట్లు ఖతార్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.ఆఫ్గాన్ రాజకీయ పరిష్కారం కోసం శాంతియుత అధికార మార్పిడి జరిగేలా వెంటనే సమగ్ర చర్యలు ప్రారంభం అవ్వాలని ఆకాంక్షించింది.ఇందుకు అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని దేశ భద్రత, స్థిరత్వం కోసం అడుగులు పడాలని అభిప్రాయపడింది.ఆఫ్గాన్ అంతటా ప్రజల భద్రతకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఏర్పడిందని పేర్కొంది.ఆఫ్గనిస్తాన్లో శాశ్వత శాంతిని సాధించడానికి ఐక్యరాజ్యసమితితో పాటు అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి పనిచేయటానికి ఖతార్ సిద్ధంగా ఉంటుందని పునరుద్ఘాటించింది.
తాజా వార్తలు
- వలసదారుల్లో ప్రయాణ భయం…
- రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి
- ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్
- బహ్రెయిన్ క్రిమినల్ జస్టిస్ పై యూఏఈ ఆసక్తి..!!
- రియాద్ సీజన్ 2025..11 మిలియన్ల మార్క్ రీచ్..!!
- ఆర్ యూ రెడీ.. న్యూఇయర్ వేడుకలు..ఫుల్ గైడ్..!!
- మస్కట్ కు INSV కౌండిన్య.. చారిత్రాత్మక ప్రయాణం..!!
- కువైట్ లో న్యూ ఇయర్ వేడుకలు..భద్రతా కట్టుదిట్టం..!!
- హోటల్ రూమ్స్ బుకింగ్ లో ఖతార్ రికార్డు..!!
- దుబాయ్: 'మా గల్ఫ్' న్యూస్ న్యూ ఇయర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కొలుసు పార్థసారథి







