కోవిడ్ వ్యాక్సిన్, క్వారంటైన్ పై సందేహాల నివృత్తికి హాట్ లైన్ ఏర్పాటు

- August 16, 2021 , by Maagulf
కోవిడ్ వ్యాక్సిన్, క్వారంటైన్ పై సందేహాల నివృత్తికి హాట్ లైన్ ఏర్పాటు

అబుధాబి: కోవిడ్ నేపథ్యంలో టెస్టులు, క్వారంటైన్ ఆంక్షలు, పబ్లిక్ ప్రాంతాల్లో అనుమతి, అబుధాబికి ఎంట్రీ, వ్యాక్సిన్ వంటి సందేహాలను నివృత్తి చేసేందుకు అబుధాబి అత్యవసర, విపత్తుల కమిటీ ప్రత్యేకంగా హాట్ లైన్ ను అందుబాటులోకి తీసుకోచ్చింది. ఈ హాట్ లైన్ ప్రజలకు నిరంతరంగా అందుబాటులో ఉంటుంది. యూఏఈలో ఉంటున్న ప్రజలు టోల్ ఫ్రీ నంబర్ 800 1717కి కాల్ చేయోచ్చు. UAE బయట నుండి కాల్ చేసేవారు +971 800 1717 నంబర్ ద్వారా కాల్ సెంటర్ ప్రతినిధులను సంప్రదించవచ్చు.  కోవిడ్ టెస్టు కేంద్రాలు, రిపోర్టులు, వ్యాక్సిన్ వివరాలు, ఎమిరైట్ అనుసరిస్తున్న క్వారంటైన్, ఐసోలేషన్ విధివిధానాలకు సంబంధించి కాల్ సెంటర్ ద్వారా సమాచారం పొందవచ్చు. అలాగే అబుదాబిలో ప్రవేశించే విధానాలు, పబ్లిక్ ప్లేసుల్లోకి అనుమతి, అల్ హోస్న్ యాప్ కు సంబంధించి సందేహాలు ఉన్నా, ఇతర సమాచారం ఏదైనా కావాలన్నా కాల్ సెంటర్ ను సంప్రదించి వివరాలను పొందవచ్చు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com