పురావస్తు పార్క్ ను సందర్శించిన సుల్తాన్ సతీమణి

- August 16, 2021 , by Maagulf
పురావస్తు పార్క్ ను సందర్శించిన సుల్తాన్ సతీమణి

ఒమన్: ఒమన్ సుల్తాన్ సతీమణి ధోఫర్ గవర్నరేట్ సలాలాలోని విలాయత్‌లోని అల్ బలీద్ పురావస్తు పార్కును సందర్శించారు. పార్క్ లో ప్రధానమైన ఫ్రాంకిన్సెన్స్ ల్యాండ్ మ్యూజియంను ఆమె తొలుత సందర్శించినట్లు హెరిటేజ్& టూరిజం మంత్రిత్వ శాఖ తెలిపింది. పురావస్తు మ్యూజియంలో వివిధ కాలాలకు చెందిన పలు చారిత్రాత్మక  వస్తువులు ఉన్నాయని, అలాగే ఒమానీ సాంప్రదాయ ఓడల నమూనాలు ప్రదర్శనకు ఉన్నట్లు వివరించింది. సుల్తాన్ సతీమణి పురావస్తు పార్కులోని వివిధ ఇతర విభాగాలను వీక్షించారు. ఆ తర్వాత ఒమాని కుటీర పరిశ్రమకు మద్దతుగా సంప్రదాయ హస్తకళలను విక్రయించే అవుట్‌లెట్‌లను సందర్శించారు. చివరగా VIP సందర్శకుల రిజిస్టర్‌లో తన ప్రశంసలను నమోదు చేయడంతో ఆమె పర్యటనను ముగించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com