యూఏఈ ప్రయాణం: అబుదాబీ గ్రీన్ లిస్ట్ నుంచి 6 దేశాల తొలగింపు

- August 17, 2021 , by Maagulf
యూఏఈ ప్రయాణం: అబుదాబీ గ్రీన్ లిస్ట్ నుంచి 6 దేశాల తొలగింపు

యూఏఈ: ఆగస్ట్ 18 నుంచి ఎనిమిది దేశాల్ని గ్రీన్ లిస్టు నుంచి తొలగించనుంది అబుదాబీ. అర్మేనియా, ఆస్ట్రియా, ఇజ్రాయెల్, ఇటలీ, మాల్దీవ్స్ మరియు అమెరికా దేశాల్ని గ్రీన్ లిస్టు నుంచి తొలగిస్తోంది. గ్రీన్ లిస్టు దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులకు అబుదాబీలోకి వచ్చాక క్వారంటైన్ అవసరం లేదు. తాజాగా 6 దేశాల తొలగింపుతో, లిస్టులోని దేశాల సంఖ్య 28కి చేరింది. అల్బేనియా, ఆస్ట్రేలియా, బహ్రెయిన్, బెల్జియం, బ్రూనై, బల్గేరియా, కెనడా, చైనా, జెక్ రిపబ్లిక్, జర్మనీ, హాంగ్ కాంగ్, హంగేరి, మాల్టా, మారిషస్, మాల్దోవా, న్యూజిలాండ్, పోలాండ్, రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్, రొమేనియా, సౌదీ అరేబియా, సెర్బియా, సీషెల్స్, సింగపూర్, సౌత్ కొరియా, స్వీడెన్, స్విట్జర్లాండ్, తైవాన్ మరియు ఉక్రెయిన్ దేశాలు గ్రీన్ లిస్టులో వున్నాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com