ఆఫ్ఘన్లో ఇండియన్స్ కోసం ఎమర్జన్సీ వీసా జారీ
- August 17, 2021
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్‌లో జరిగిన తాజా పరిణామాల నేపధ్యంలో భారతదేశ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆఫ్ఘన్లో ఉన్న భారతీయుల కోసం సత్వర చర్యలు చేపట్టింది. అందుకే ఎమర్జన్సీ వీసాలు జారీ చేస్తోంది ఇండియా.
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల రాజ్యం ఏర్పడింది. ఆప్ఘన్ సైన్యానికి తాలిబన్లకు గత కొద్దిరోజులుగా జరుగుతున్న యుద్ధంలో తాలిబన్లు పైచేయి సాధించారు. ఆఫ్ఘన్లో జరిగిన తాజా పరిణామాల నేపధ్యంలో అక్కడున్న భారతీయుల్ని రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆఫ్ఘన్లో చిక్కుకున్న భారతీయుల్ని వెనక్కి రప్పించేందుకు కేంద్రం ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ఎమర్జన్సీ వీసాల జారీ చేస్తోంది. ఆఫ్ఘన్లో ఉన్న ప్రస్తుత పరిస్థితిని పరిగణలో తీసుకుని అక్కడున్న భారతీయులు ఇండియాకు వచ్చేలా ఈ వీసా సదుపాయం కల్పిస్తోంది వీసా దరఖాస్తుల్ని వేగంగా ట్రాక్ చేసే లక్ష్యంతో ఈ ఎమర్జెన్సీ ఎక్స్‌మిస్క్ వీసా పేరుతో కొత్త కేటగరీ ఎలక్ట్రానిక్ వీసా ప్రవేశపెట్టింది. ఈ ఎలక్ట్రానికి వీసా ఎలా తీసుకోవాలంటే..
ముందుగాhttp://indianvisaonline.gov.in/evisa/registration పై క్లిక్ చేయాలి. తరువాత Apply here for e-visa పై క్లిక్ చేసి నేషనాలిటీ ఆఫ్ఘనిస్తాన్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తరువాత Passport Type, Port of Arrival, Date of Birth, Email Id, Expected date of arrival వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు వీసా కేటగరీలో ఎమర్జెన్సీ ఎక్స్మిక్స్ వీసా ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తరువాత అక్కడ కన్పించే క్యాప్చా నమోదు చేసి రిఫరెన్స్ కోసం స్క్రీన్ షాట్ తీసుకుని Continue పై క్లిక్ చేయాలి. ప్రాధమిక వివరాల్ని పూర్తి చేసిన తరువాత పేజీలో దరఖాస్తుదారుల వివరాల కోసం ఉండే ఫారం పూర్తి చేయాలి. ఈ వీసాకు ఫీజు ఉండదు. ఆప్ఘనిస్తాన్ నుంచి వచ్చే భారతీయుల కోసం ఓ హెల్ప్‌లైన్ నెంబర్ 919717785379 జారీ చేశారు.
తాజా వార్తలు
- చైనా: ప్రపంచంలోనే అతిపొడవైన టన్నెల్
- మనమా-దియార్ అల్ ముహారక్ మధ్య కొత్త బ్రిడ్జి..!!
- ఉగ్రవాదుల బాంబు దాడిని ఖండించిన ఖతార్..!!
- ప్రవాస కార్మికుల ఫుడ్ స్క్రీనింగ్ కేంద్రాలలో తనిఖీలు..!!
- ఫుడ్ ట్రక్ స్టార్టప్‌లకు మద్దతుగా మసార్ ప్రారంభం..!!
- కత్తితో దాడి..6 మందికి జైలు శిక్ష, బహిష్కరణ వేటు..!!
- కువైట్ లో నీటి భద్రతకు భరోసా..లార్జెస్ట్ వాటర్ ప్లాంట్..!!
- తెలంగాణ: మహిళలకు ‘కామన్ మొబిలిటీ’ కార్డులు
- ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం..
- తిరుపతి: నూతనంగా నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







